Kotamreddy: కోటంరెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కొత్త ట్విస్ట్‌.. రామశివారెడ్డి వివరణ

ఏపీలో హాట్‌ టాపిక్‌గా మారిన వైకాపా రెబల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై.. ఆయన స్నేహితుడు రామశివారెడ్డి (Rama shivareddy) క్లారిటీ ఇచ్చారు. అది ఫోన్‌ ట్యాపింగ్‌ (phone tapping) కాదని.. కాల్‌ రికార్డింగ్‌ మాత్రమేనని స్పష్టతనిచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు రావడం బాధ కలిగించిందన్నారు. ‘‘నా ఫోన్‌లో ఆటోమేటిక్‌గా కాల్‌ రికార్డు అవుతుంది. ఆ రోజు కూడా అలాగే రికార్డైంది. ఓ కాంట్రాక్ట్‌ విషయంపై రికార్డింగ్‌ని నా స్నేహితుల వద్ద యాదృచ్చికంగా వినిపించాను. రాష్ట్ర ప్రభుత్వంపై ఇంత ఆరోపణలు వస్తాయని ఊహించలేదు’’ అని చెప్పారు. 

Published : 08 Feb 2023 17:31 IST

Tags :

మరిన్ని