Ravanasura Trailer: రవితేజ ‘రావణాసుర’ ట్రైలర్‌ వచ్చేసింది!

రవితేజ (Ravi teja) కథానాయకుడిగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న సైకలాజికల్‌  యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘రావణాసుర’ (Ravanasura). అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాశ్‌, దక్షా నగర్కర్‌ కథానాయికలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం ‘రావణాసుర’ ట్రైలర్‌ (Ravanasura Trailer) విడుదల చేసింది. ఇప్పటివరకూ చూడని సరికొత్త పాత్రలో రవితేజ దర్శనమిచ్చారు.

Updated : 28 Mar 2023 16:09 IST
Tags :

మరిన్ని