Waltair Veerayya: ఏదో ఒకరోజు నేనూ వెళ్లి అక్కడ కూర్చుంటా అనుకున్నా.. ఇక్కడి దాకా వచ్చా: రవితేజ

చిరంజీవి (Chiranjeevi), రవితేజ (Raviteja) కలిసి నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’(Waltair Veerayya). బాబీ (కె.ఎస్‌.రవీంద్ర) తెరకెక్కించారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి విశాఖపట్నంలో వాల్తేరు వీరయ్య మెగా మాస్‌ పార్టీ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో రవితేజ మాట్లాడుతూ.. ‘అన్నయ్య చిరంజీవితో నా ప్రయాణం విజయవాడ నుంచి మొదలైంది. సహాయ నటుడిగా మొదలై, అన్నయ్యకు తమ్ముడిగా మారి, ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’తో ఇక్కడి దాకా వచ్చింది. చాలా గర్వంగా ఉంది’ అన్నారు.

Published : 09 Jan 2023 15:40 IST

Tags :

మరిన్ని