Raviteja: ‘టైగర్‌ నాగేశ్వరరావు’ వచ్చేశాడు.. ట్రైలర్‌ చూశారా?

హైదరాబాద్‌: రవితేజ (Raviteja) హీరోగా వంశీ తెరకెక్కిస్తోన్న పాన్‌ ఇండియా చిత్రం  ‘టైగర్‌ నాగేశ్వరరావు’. మంగళవారం ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో తన మాస్‌ లుక్‌, డైలాగులతో రవితేజ ఆకట్టుకున్నారు. ఇప్పటికే పాటలతో అంచనాలు పెంచేసిన ఈ చిత్రబృందం తాజాగా ట్రైలర్‌తో మరింత ఆసక్తి కలిగేలా చేసింది. అక్టోబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రవితేజ సరసన  నూపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్ నటించారు. 70వ దశకంలో పేరు మోసిన స్టూవర్టుపురం గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవిత కథతో తెరకెక్కిన చిత్రమిది. రేణూ దేశాయ్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Published : 03 Oct 2023 14:24 IST
Tags :

మరిన్ని