Chandrababu: ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. పోటీకి తెదేపా సిద్ధం: చంద్రబాబు

రాష్ట్రంలో రేపే ఎన్నికలు పెట్టినా పోటీకి తెలుగుదేశం(TDP) సిద్ధంగా ఉందని చంద్రబాబు(Chandrababu) ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు వైకాపా(YSRCP) ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జగన్‌తో ఇమడలేక ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలే తెలుగుదేశంలో చేరేందుకు సంప్రదింపులు చేస్తున్నారని పునరుద్ఘాటించారు. పట్టభద్రుల మండలి ఎన్నికల్లో ట్రైలర్ మాత్రమే చూపించామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌కు సినిమా మొత్తం చూపిస్తామని హెచ్చరించారు.  

Published : 02 Apr 2023 09:35 IST

మరిన్ని