TS News: సర్కారు బడిలో మిర్చి ఘాటు.. గ్రామస్థుల తీవ్ర ఆగ్రహం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని పంకెనలో సర్కారు బడి మిర్చి కల్లంగా మారింది. విద్యార్థుల తరగతి గదిలో స్కూల్‌ ఛైర్మన్‌ మోతె కిష్టయ్య తడిసిన మిర్చిని ఆరబోశారు. సొంత అవసరాలకు పాఠశాలను ఉపయోగించుకోవడంతో విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడిందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిర్చి ఘాటుకు పిల్లలకు ఇబ్బంది కలుగుతుందని.. సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

Updated : 20 Mar 2023 15:39 IST

మరిన్ని