Revanth Reddy: ఫిర్యాదు ఇస్తానన్నా.. ఏఆర్‌ శ్రీనివాస్‌ తీసుకోలేదు: రేవంత్‌ రెడ్డి

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్, భాజపాలకు నోటీసులిచ్చి.. మంత్రి కేటీఆర్‌కు ఎందుకివ్వలేదని సిట్ అధికారులను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం, అధికారులు.. ప్రతిపక్షాలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. పేపర్​లీకేజీ కేసులో ఆరోపణలు చేసిన రేవంత్‌ రెడ్డి తన వద్ద ఉన్న వివరాలతో గురువారం సిట్ విచారణకు హాజరయ్యారు. కేటీఆర్‌ వ్యాఖ్యల వివరాలను సిట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన రేవంత్.. ఆయన్ను విచారిస్తే పూర్తి సమాచారంతో పాటు అసలు నేరస్థులు బయటపడతారని తెలిపారు. 30 లక్షల మందికి న్యాయం జరగాలంటే.. రాజకీయాలకు అతీతంగా విచారణ చేపట్టాలని అధికారులను కోరానని తెలిపారు.

Updated : 23 Mar 2023 17:21 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు