Kantara: ‘కాంతారా’ తెలుగులోనూ వచ్చేస్తోంది.. ట్రైలర్‌ చూసేయండి..!

‘కాంతారా’.. ఇటీవల కన్నడలో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం.. తాజాగా తెలుగు, హిందీ భాషల్లోనూ విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు చిత్ర బృందం ‘కాంతారా’ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది. అక్టోబరు 15వ తేదీ నుంచి తెలుగు, హిందీ భాషల్లో ‘కాంతారా’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 09 Oct 2022 15:50 IST
Tags :

మరిన్ని