Hyderabad News: జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ గుడి వద్ద కారు బీభత్సం

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. పెద్దమ గుడి వద్ద కారు అతివేగంతో వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టింది. ఎయిర్‌ బెలూన్‌ ఓపెన్‌ కావడంతో ప్రాణాపాయం తప్పింది. డ్రైవర్‌ బానోతు చందు మద్యం మత్తుతో కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలో ఆల్కహాల్‌ శాతం 111 పాయింట్లు ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Published : 12 Aug 2022 11:47 IST

Hyderabad News: జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ గుడి వద్ద కారు బీభత్సం

Tags :

మరిన్ని