Bellamkonda Suresh: నిర్మాత బెల్లంకొండ సురేష్ బెంజ్‌ కారులో చోరీ

ప్రముఖ తెలుగు సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh) కారులో చోరీ జరిగింది. జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలో బెల్లంకొండ సురేష్ అలియాస్ సురేంద్ర చౌదరికి సాయిగణేష్ ప్రొడక్షన్స్ పేరుతో కార్యాలయం ఉంది. గురువారం మధ్యాహ్నం ఆయనకు సంబంధించిన బెంజి కారును కార్యాలయం ముందు నిలిపారు. శుక్రవారం ఉదయం చూడగా కారు ఎడమవైపు వెనుక సీటు అద్దం పగిలి ఉంది. లోపల ఉంచిన రూ.50 వేల నగదు, 11 ఖరీదైన మద్యం సీసాలు కనిపించలేదు. ఒక్కో మద్యం సీసా ఖరీదు దాదాపు రూ.28 వేలని సమాచారం. ఈ మేరకు కార్యాలయ సిబ్బంది జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Updated : 10 Jun 2023 13:40 IST
Tags :

మరిన్ని