WTC Final: రోహిత్ శర్మ వెరైటీ ‘డీఆర్‌ఎస్‌’ కాల్ చూశారా..?

డబ్ల్యూటీసీ ఫైనల్‌ (WTC Final 2023)లో తొలి రోజు ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. శార్దూల్ ఠాకూర్‌ బౌలింగ్‌లో (17.3వ ఓవర్) ఆసీస్‌ బ్యాటర్ లబుషేన్ ఆడేందుకు ప్రయత్నించినప్పుడు బంతి ప్యాడ్లను తాకింది. భారత ఆటగాళ్లు అప్పీలు చేసినా అంపైర్ ఔట్‌ ఇవ్వలేదు. దీంతో డీఆర్‌ఎస్‌ వెళ్దామా..? వద్దా..? అనే చర్చ సాగింది. ఈ క్రమంలో మరో ఐదు సెకన్లు మాత్రమే ఉన్నప్పుడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ డీఆర్‌ఎస్‌ కోసం చేసిన వెరైటీ అప్పీలు నెట్టింట వైరల్‌గా మారింది. సమీక్షలోనూ నాటౌట్‌గా తేలింది. ఆ వీడియోను మీరూ చూసేయండి..

Updated : 08 Jun 2023 12:24 IST
Tags :

మరిన్ని