Viral Video: ఓవైపు రైలు, మరోవైపు నిండు ప్రాణం.. లేడీ కానిస్టేబుల్‌ ధైర్యానికి సలామ్‌!

రైలు పట్టాలపై ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడి శభాష్‌ అనిపించుకుంది ఆర్పీఎఫ్‌కు చెందిన ఓ లేడీ కానిస్టేబుల్‌. పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మేదినీపూర్‌ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. స్టేషన్‌లోకి వచ్చిన ఓ వ్యక్తి.. రైలు వచ్చే సమయం చూసి ఉన్నట్టుండి పట్టాలపై పడుకున్నాడు. దీన్ని గమనించిన లేడీ కానిస్టేబుల్‌ కె సుమతి.. వెంటనే వెళ్లి వ్యక్తిని పక్కకు లాగి ప్రాణాలు నిలిపింది. ఈ మేరకు సుమతిని అభినందిస్తూ.. ఆర్పీఎఫ్‌ ఈ ఘటన సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను షేర్‌ చేసింది.

Updated : 09 Jun 2023 13:08 IST

Tags :

మరిన్ని