Viral Video: కారును ఢీకొట్టి చర్చి కమాన్‌పైకి దూసుకెళ్లిన బస్సు..!

కేరళలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన బస్సు అదుపు తప్పి కారును ఢీకొట్టింది. అనంతరం రోడ్డు పక్కనే ఉన్న చర్చి కమాన్‌పైకి దూసుకెళ్లింది. దీంతో చర్చి కమాన్ ఒక్కసారిగా కుప్పకూలి.. దాని శిథిలాలు బస్సుపై పడ్డాయి. పథనంతిట్ట జిల్లాలోని కిజవల్లోర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులకు గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీల్లో రికార్డయ్యాయి.

Updated : 11 Mar 2023 19:44 IST

Tags :

మరిన్ని