Parliament: సింగరేణి బొగ్గుగనుల వేలంపై లోక్‌సభలో మాటల యుద్ధం

సింగరేణి బొగ్గుగనుల వేలంపై లోక్‌సభలో అధికార, విపక్షాల మధ్య కాసేపు మాటలయుద్ధం జరిగింది. రాష్ట్రంలోని కల్యాణ్‌గని, కోయగూడెం, సత్తుపల్లి, శ్రావణ్‌పల్లి బొగ్గు గనులను ఈ-వేలంలో చేర్చారంటూ నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ తీరు సరైంది కాదన్న ఆయన.. వెంటనే ఈ ప్రతిపాదనను రద్దు చేసి సింగరేణికే గనులను కేటాయించాలని డిమాండ్  చేశారు. ఉత్తమ్  వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి.. గనుల వేలం పారదర్శకంగా జరుగుతుందన్నారు. 

Published : 07 Dec 2022 18:22 IST

Tags :

మరిన్ని