Bakhmut: బఖ్‌ముత్‌ మా మనసుల్లో మాత్రమే ఉంది: జెలెన్‌స్కీ

ఉక్రెయిన్‌ (Ukraine)లో కీలకమైన బఖ్‌ముత్‌ (Bakhmut) నగరం తమ స్వాధీనం అయినట్లు రష్యా ప్రకటించింది. వాగ్నర్ ప్రైవేటు సైన్యంతో కలిసి ఈ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఇక్కడ 8 నెలలకుపైగా జరిగిన పోరాటం (Russia Ukraine War)లో ఇరువర్గాలు వేలాది సైనికులను కోల్పోయాయి. బఖ్‌ముత్‌లో ఎటు చూసినా పెను విధ్వంసమే కనిపిస్తోందన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. అక్కడ ఏమీ మిగల్లేదని ప్రతిదాన్ని రష్యన్లు నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి బఖ్‌ముత్‌ తమ మనసుల్లో మాత్రమే ఉందని జెలెన్‌స్కీ వెల్లడించారు.

Published : 21 May 2023 21:41 IST

Tags :

మరిన్ని