Video: నయా రికార్డు.. ఒకే ఓవర్‌లో 7 సిక్సులు

ముంబయి: రుతురాజ్ గైక్వాడ్‌ చరిత్ర సృష్టించాడు. ఒకే ఓవర్‌లో ఏడు సిక్స్‌లు కొట్టి నయా రికార్డు నెలకొల్పాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో రెండో క్వార్టర్‌ ఫైనల్‌ సందర్భంగా ఉత్తర్‌ ప్రదేశ్‌పై గైక్వాడ్‌ ఈ ఫీట్‌ సాధించాడు. మహారాష్ట్ర తరఫున ఆడుతున్న గైక్వాడ్‌... శివ సింగ్‌ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. శివ వేసిన ఓవర్‌లో నోబాల్‌ పడటంతో ఏడు బంతులకు ఏడు సిక్స్‌లు.. మొత్తం 43 పరుగులు రాబట్టాడు. దీంతో మహారాష్ట్ర 50 ఓవర్లకు 330 పరుగులు చేసింది. గైక్వాడ్‌ 220 (159 బంతులు; 10x4, 16x6) పరుగులు చేశాడు.

Updated : 28 Nov 2022 14:00 IST
Tags :

మరిన్ని