Rajasthan: రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో మళ్లీ భగ్గుమన్న విభేదాలు

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్‌లో.. అధికార కాంగ్రెస్‌లో మరోసారి అగ్గి రాజుకుంది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌ (Ashok Gehlot)కు, కీలక నాయకుడు సచిన్ పైలట్‌ (Sachin Pilot)కు మధ్య వైరుధ్యాలు మరోసారి బయటపడ్డాయి. సచిన్ పైలట్ తిరుగుబాటు చేసినప్పుడు.. భాజపా నేత వసుంధర రాజే (Vasundhara Raje) తన ప్రభుత్వాన్ని కాపాడారని సీఎం చెప్పడం తాజా వివాదానికి తెరతీసింది. ప్రతిపక్ష నేతను పొగుడుతూ.. పార్టీ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ సీనియర్ నేతలను గహ్లోత్ అవమానించారని పైలట్ మండిపడ్డారు. అవినీతికి వ్యతిరేకంగా తాను పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు.

Updated : 09 May 2023 19:11 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు