Sachin: సచిన్‌కు వినూత్నంగా అభిమాని జన్మదిన శుభాకాంక్షలు

క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) జన్మదినం సందర్భంగా ముంబయికి చెందిన ఓ వీరాభిమాని భారీ చిత్రపటాన్ని రూపొందించాడు. ఓ అపార్టుమెంట్ ప్రాంగణంలోని ఖాళీ స్థలంలో 50 అడుగుల పొడవైన సచిన్ పెయింటింగ్ వేశాడు. సచిన్ 50వ జన్మదినం సందర్భంగా 50 అడుగులతో పెయింటింగ్ (Draws 50 Feet) వేసినట్లు అభిషేక్ నందకిశోర్ తెలిపాడు. జాతీయ జెండా మధ్యలో సచిన్ ముఖం కనిపించేలా అద్భుతంగా పెయింటింగ్ ను తీర్చిదిద్దాడు. సచిన్ సాధించిన ఘనతలును అందులో పొందుపరిచాడు.

Published : 25 Apr 2023 19:06 IST
Tags :

మరిన్ని