Sachin Tendulkar: ఎట్టకేలకు ఐపీఎల్‌లో ‘మా’కో వికెట్‌ వచ్చింది: సచిన్‌

హైదరాబాద్‌ (SRH)తో మ్యాచ్‌లో సచిన్‌ (Sachin Tendulkar) తనయుడు అర్జున్‌ తెందూల్కర్‌ (Arjun Tendulkar).. తన ఐపీఎల్‌ (IPL) కెరీర్‌లో తొలి వికెట్‌ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రెస్సింగ్‌ రూమ్‌లో జరిగిన సంబరాల్లో సచిన్‌ పాల్గొన్నారు. ఐపీఎల్‌లో తమ కుటుంబానికి ఎట్టకేలకు ఓ వికెట్‌ వచ్చిందని సచిన్‌ ఆనందం వ్యక్తం చేశాడు. కాగా, ఐపీఎల్‌ - 2009లో సచిన్‌ ఆరు ఓవర్లు వేసినప్పటికీ.. ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. ఈ విషయంలో ఇప్పుడు సచిన్‌ను అతడి తనయుడు అధిగమించడం విశేషం.

Updated : 19 Apr 2023 17:56 IST
Tags :

మరిన్ని