Sarkaru Naukari: సింగర్‌ సునీత కుమారుడి.. ‘సర్కారు నౌకరి’ షురూ

గాయని సునీత తనయుడు ఆకాశ్‌ను హీరోగా పరిచయం చేస్తూ.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. గంగనమోని శేఖర్ దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు క్లాప్ కొట్టగా.. నిర్మాత ప్రసాద్ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. ఈ చిత్రంలో ఆకాశ్‌కు జోడీగా భావన వళపండల్ నటించనుంది. తనికెళ్ల భరణి, సూర్య, సాయిశ్రీనివాస్ వడ్లమాని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Published : 26 Jan 2023 18:07 IST

Tags :

మరిన్ని