The Kerala Story: సినిమా విడుదలపై స్టేకు సుప్రీం తిరస్కరణ

విద్వేషపూరిత ప్రసంగాలు ఉన్నాయన్న కారణంగా ద కేరళ స్టోరీ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. వచ్చే శుక్రవారం ఆ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా ఘోరమైన ద్వేషపూరిత ప్రసంగాల ప్రచారమని న్యాయవాది నిజాంపాషా పేర్కొన్నారు. ఐతే ఆ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చింది కాబట్టి, వ్యక్తిగత ప్రసంగం కింద పరిగణించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. సినిమా విడుదల సవాల్ చేయదలచుకుంటే తగిన వేదికపై సెన్సార్ సర్టిఫికెటును సవాలు చేయాలని ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్ మొదట హైకోర్టును ఆశ్రయించాలని, ఇలాగైతే ప్రతి ఒక్కరూ సుప్రీంకోర్టుకు వస్తారంటూ జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు.

Published : 04 May 2023 10:41 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు