Hyderabad: విద్యుత్‌ కాంతుల వెలుగులో శిల్పా ఫ్లైఓవర్‌ ధగధగలు.. డ్రోన్ వ్యూ చూడండి

ఐటీ కారిడార్‌ను బాహ్యవలయ రహదారి (ఓఆర్‌ఆర్‌)తో అనుసంధానం చేస్తూ నిర్మించిన శిల్పా లేఅవుట్‌ మొదటి దశ పైవంతెన ప్రారంభమైంది. ఐకియా మాల్‌ వెనక మొదలయ్యే ఈ పై వంతెన 30 అంతస్తుల ఎత్తైన భవనాల మధ్య నుంచి సాగిపోతూ విశాలమైన ఓఆర్‌ఆర్‌పైకి చేరుతుంది. బహుళ అంతస్తుల మధ్య వంపులు తిరుగుతూ.. రెండు అంతస్తుల్లో రూపుదిద్దుకున్న ఈ వంతెనకు అనేక ప్రత్యేకతలున్నాయని, ఆకాశం నుంచి చూస్తే శిల్పంలా కనిపిస్తుందని ఇంజినీర్లు చెబుతున్నారు. విద్యుత్‌ దీపాల వెలుగులో ధగ ధగలాడుతున్న భాగ్యనగరి మణిహారాన్ని మీరూ చూసేయండి.

Published : 26 Nov 2022 15:22 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు