ప్రజలకు ఔషధల ధరల బాదుడు తప్పదా ?

నెలవారీ బడ్జెట్‌లో సరకుల కోసమే కాదు, మందుల కోసమూ ప్రత్యేకంగా లెక్క రాసుకుంటారు చాలామంది. ప్రస్తుత జీవనశైలితో ఔషధాలు కూడా నిత్యావసరాల జాబితాలో చేరి పోయాయి. చిన్నదో, పెద్దదో ఏదో ఓ అనారోగ్య సమస్య వెంటాడుతోంది. ఆరోగ్యం కాపాడుకు నేందుకు రకరకాల మందులు మింగాల్సి వస్తోంది. ఇప్పుడు వీటి ధరలూ కొండెక్కి కూర్చున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం పేరు చెప్పి...అమాంతం 10%కిపైగా ధరలు పెంచేశారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు మండిపోతుంటే...ఔషధాలూ ప్రియమైపోయాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పెరుగుదల అమల్లోకి రాగా...అప్పటి నుంచి సామాన్యులపై బాదుడు మొదలైంది. పారాసిటమాల్ నుంచి యాంటీ బయోటిక్ ఔషధాల వరకూ అన్నింటికీ అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇవన్నీ ఒకెత్తైతే...ధరల నియంత్రణ తమ పరిధిలో లేదని కేంద్రం ప్రకటించటం మరో ఎత్తు.

Published : 11 Apr 2022 23:12 IST
Tags :

మరిన్ని