Surjewala: కర్ణాటక సీఎం ఎవరనేది ఇంకా ఖరారు లేదు: సూర్జేవాలా

కర్ణాటక సీఎం (Karnataka CM) పేరు ఖరారు చేసేందుకు కాంగ్రెస్ (Congress) అధిష్ఠానం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా (Randeep Surjewala) తెలిపారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఇవాళ లేదా రేపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. నిర్ణయం తీసుకున్న వెంటనే సమాచారం ఇవ్వనున్నట్లు చెప్పారు. అప్పటివరకు తప్పుడు ప్రచారాలు, ఊహాగానాలు ప్రసారం చేయొద్దని సూర్జేవాలా.. మీడియాకు విజ్ఞప్తి చేశారు.

Updated : 31 May 2023 15:52 IST

Tags :

మరిన్ని