TDP: సీబీఐ విచారణను స్వాగతిస్తున్నా: సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

నాపై ఆరోపణలు చేస్తూ మంత్రి కాకాణి తప్పుడు పత్రాలు తీసుకొచ్చారని తెదేపా సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. కుక్కలు మొరిగాయి, దొంగలు ఎత్తుకెళ్లారని ఒక ఎస్పీ చెప్పారని ఆయన గుర్తుచేశారు. ‘అసలే తప్పుడు పత్రాలు.. మరోవైపు చోరీకి గురయ్యాయన్నారు. నేరాలు చేసిన వ్యక్తిని కేబినెట్‌ నుంచి జగన్‌ వెంటనే తొలగించాలి. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నా. హైకోర్టు న్యాయమూర్తుల పర్యవేక్షణలో విచారణ జరగాలి’ అని ఆయన అన్నారు. 

Updated : 24 Nov 2022 13:08 IST

మరిన్ని

ap-districts
ts-districts