BJP: అధిష్ఠానం ఎక్కడ పనిచేయమంటే అక్కడే చేస్తా: మాజీ సీఎం కిరణ్ కుమార్‌

భాజపా అధిష్ఠానం ఎక్కడ పనిచేయమంటే అక్కడ పనిచేస్తానని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌ (Kiran Kumar Reddy) రెడ్డి తెలిపారు. తనకున్న అనుభవంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju)తో.. హైదరాబాద్‌లో భేటీ తర్వాత ఆయన మాట్లాడారు. భాజపాలో చేరిన తర్వాత నెల రోజులపాటు అమెరికా వెళ్లినట్లు చెప్పారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఏపీ ప్రభుత్వ పరిపాలనపై స్పందిస్తానన్నారు.

Published : 31 May 2023 17:45 IST
Tags :

మరిన్ని