Neera Cafe: హైదరాబాద్‌లో నీరా కేఫ్‌.. విశిష్టతలివే!

ప్రకృతికి దగ్గరగా ఆహ్లాదమైన పంట పొలాల మధ్య చెట్టు నుంచి వచ్చే కల్లును అన్ని వయసుల వారు ఇష్టపడతారు. అలాంటి కల్లుతో పాటు.. తాటి, ఈత చెట్ల నుంచి వచ్చే నీరా కూడా అందరికీ సుపరిచితమే! నీరాలో ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉండటంతో.. వయసుతో సంబంధం లేకుండా దీన్ని సేవించేందుకు ఇష్టపడతారు. కానీ, ఇది వేకువజామునే లభిస్తుంది. నీరా కావాలంటే ఒకరోజు ముందే ప్రణాళికలు అవసరం. ఈ నేపథ్యంలో నీరాను హుస్సేన్ సాగర్ తీరాన అత్యంత ఆకర్షణీయంగా ‘నీరా కేఫ్’ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

Published : 07 Feb 2023 10:58 IST

Tags :

మరిన్ని