Sridevi Drama Company: ఓవైపు ఎస్తర్‌.. మరోవైపు ‘బలగం’ టీమ్‌.. ఇక మామూలుగా ఉంటుందా!

తమ సక్సెస్‌ను సెలబ్రేషన్‌ చేసుకోవడానికి ‘బలగం (Balagam)’ టీమ్‌.. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ (Sridevi Drama Company)’కి విచ్చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు వేణు యెల్దండి (venu yeldandi) మాట్లాడుతూ.. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’కి వచ్చినట్లు లేదని తన ఇంటికి వచ్చినట్లు ఉందని చెప్పారు. మరోవైపు, సినీ నటి ఎస్తర్‌ నోరోన్హా (Ester Noronha) కూడా తాజా ఎపిసోడ్‌కు వచ్చి.. తన డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ పూర్తి ఎపిసోడ్‌  చూడాలంటే.. మార్చి 19 వరకు ఆగాల్సిందే. అప్పటివరకూ ఈ ప్రోమోను మీరూ చూసేయండి మరి.

Updated : 13 Mar 2023 19:47 IST

Tags :

మరిన్ని