Yanamala: రూ.12.50 లక్షల కోట్లు దాటనున్న ఏపీ అప్పులు!: యనమల

జగన్(CM Jagan) ప్రభుత్వం అంతమయ్యే సమయానికి రాష్ట్రం మొత్తం అప్పు రూ.12.50 లక్షల కోట్లు దాటనుందని తెలుగుదేశం(TDP) సీనియర్ నేత యనమల రామకృష్ణుడు(Yanamala Ramakrishnudu) అంచనావేశారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరిపై ఐదున్నర లక్షల రూపాయల అప్పు భారం పడుతుందన్నారు. రానున్న కాలంలో వచ్చిన ఆదాయమంతా కేవలం అప్పులు చెల్లించడానికే సరిపోతుందన్నారు. ఫలితంగా అభివృద్ధి ఉనికే ప్రశ్నార్థకం అవుతుందన్నారు. ఏపీ ఆర్థిక అధోగతిపాలైందని కాగ్(CAG) పదేపదే హెచ్చరిస్తున్నా.. కేంద్రం, ఆర్బీఐలు ఎందుకు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నాయని యనమల విమర్శించారు. 

Updated : 27 Mar 2023 15:37 IST

మరిన్ని