Viral Video: పిచ్చికుక్క స్వైర విహారం.. కనిపించిన చిన్నారులపై దాడి

రంగారెడ్డి జిల్లా కొత్తూరు పురపాలిక పరిధిలోని తిమ్మాపూర్ ఎస్సీ కాలనీలో బుధవారం సాయంత్రం.. ఓ వీధి కుక్క తిరుగుతూ కనబడిన చిన్నారులను కరుస్తూ వచ్చింది.  దీంతో పలువురు చిన్నారులు కుక్క గాట్లకు గురయ్యారు. చివరకు స్థానికులు కుక్కపై కర్రలు, రాళ్లతో దాడి చేసి హతమార్చారు. గాయపడిన చిన్నారులను హుటాహుటిన కుటుంబ సభ్యులు షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం వైద్యులు ఇద్దరు చిన్నారులను నీలోఫర్‌కు సిఫార్సు చేశారు.

Published : 07 Jun 2023 22:30 IST

Viral Video: పిచ్చికుక్క స్వైర విహారం.. కనిపించిన చిన్నారులపై దాడి

మరిన్ని