Suma Adda: బస్సు డోరు తీసి బాలకృష్ణ నన్ను జనంలోకి తోసేశారు..!

ప్రతి శనివారం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న షో.. ‘సుమ అడ్డా(Suma Adda)’. ఈ వారం కూడా మరింత వినోదం పంచేందుకు సిద్ధమైంది. మార్చి 4న ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో నటీనటులు హేమ, సమీర్‌, గిరిధర్‌ సందడి చేశారు. వారంతా అన్నయ్య సినిమా స్పూఫ్ చేసి నవ్వించారు. ఓ ప్రమోషన్‌ ఈవెంట్‌లో భారీగా జనం మధ్యలోకి.. బస్సు డోరు తీసి తనను బాలకృష్ణ తోసేశారని సమీర్‌ చెప్పారు. ఈ విశేషాల కోసం పూర్తి ఎపిసోడ్‌ చూడాల్సిందే. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మీరూ చూసేయండి. 

Updated : 01 Mar 2023 10:56 IST

మరిన్ని