Suma Adda: డోంట్‌ స్టాప్‌ లాఫింగ్‌.. ‘సుమ అడ్డా’కు ‘వాల్తేరు వీరయ్య’

‘డోంట్‌ స్టాప్‌ లాఫింగ్‌. సుమ అడ్డా.. లోడింగ్‌’ అంటూ మెగాస్టార్‌ చిరంజీవి త్వరలోనే బుల్లితెర ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈటీవీ వేదికగా ఇటీవలే ప్రారంభమైన షో ‘సుమ అడ్డా’. ఈ షోకు సుమ యాంకరింగ్‌ చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ‘వాల్తేరు వీరయ్య’ విడుదల కానున్న నేపథ్యంలో చిరంజీవితో పాటు చిత్ర బృందం ‘సుమ అడ్డా’కు వచ్చి సందడి చేసింది.  దీనికి సంబంధించి తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. త్వరలోనే ఈ ఎపిసోడ్‌ ప్రసారం కానుంది.   

Updated : 07 Jan 2023 01:10 IST

మరిన్ని