Diamond Ganpati: రూ.600 కోట్ల డైమండ్ గణపతికి వజ్రాల వ్యాపారి విశేష పూజ!

సూరత్‌లోని ఓ వజ్రాల వ్యాపారి గణపతి ఆకారంలో ఉన్న.. ప్రపంచంలోనే అత్యంత అరుదైన వజ్రానికి పూజలు చేస్తున్నారు. సైజులో కోహినూర్ కంటే పెద్దగా ఉన్న ఈ వజ్రం.. 182.3 క్యారెట్లతో 36.5 గ్రాముల బరువు ఉంది. కనుభాయ్ అసోదరియా అనే వ్యాపారి ఈ వజ్ర గణపతిని ఏడాదికి ఒక్కరోజు మాత్రమే బయటకు తీస్తున్నారు. ఈ వజ్రం ధరను కనుభాయ్ వెల్లడించలేదు. అయితే బహిరంగ మార్కెట్‌లో దీని విలువ రూ.600 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఈ డైమండ్ గణపతి ఫొటోలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, యోగా గురువు రామ్ దేవ్ బాబా వంటి ప్రముఖులకు కనుభాయ్ అందించారు.

Published : 23 Sep 2023 14:23 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు