Suryakumar Yadav: తినడం ఆపేసి.. చిన్నారి ఫ్యాన్స్‌తో సూర్య సెల్ఫీలు

రాజస్థాన్‌తో మ్యాచ్‌లో బౌండరీలే కాకుండా ముంబయి ఇండియన్స్‌ స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ (Suryakumar Yadav).. చిన్నారుల హృదయాలను కొల్లగొట్టాడు. మ్యాచ్‌ తర్వాత వాంఖడే మైదానం నుంచి స్నాక్స్‌ తింటూ బస్సు ఎక్కేందుకు వచ్చిన సూర్యను.. కలిసేందుకు చిన్నారి అభిమానులు ముందుకొచ్చారు. భద్రతా సిబ్బంది ఆపే ప్రయత్నం చేయగా.. వారిని చూసి సూర్య తన వద్దకు రమ్మన్నాడు. అనంతరం తాను తింటున్న స్నాక్స్‌ను పక్కన పెట్టి.. చిన్నారులతో సెల్ఫీలు దిగి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. దీంతో చిన్నారులు ఆనందంతో కేరింతలు కొట్టారు.

Published : 01 May 2023 15:31 IST

Tags :

మరిన్ని