Suryakumar Yadav: మార్క్‌ షాట్లతో విరుచుకుపడ్డ ‘స్కై’.. చూస్తే ఫిదా కావాల్సిందే!

ముంబయి: ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబయి 16.3 ఓవర్లలోనే ఛేదించింది. సూర్యకుమార్‌ యాదవ్‌(83: 35 బంతుల్లో 7X4, 6X6) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ‘మిస్టర్‌ 360’గా పేరున్న సూర్య తన పేరుకు తగ్గట్లు మరోసారి మార్క్‌ షాట్లతో విధ్వంసం సృష్టించాడు. తొలుత నెమ్మదిగా ఆడిన ‘స్కై’.. ఆ తర్వాత గేర్‌ మార్చి ఎడాపెడా సిక్స్‌లు, ఫోర్లతో ఆర్సీబీ బౌలర్లను ఊపిరి సడలకుండా చేశాడు. 26 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన సూర్య ఆ తర్వాత మరింతగా రెచ్చిపోయాడు.   

Updated : 10 May 2023 13:09 IST

Tags :

మరిన్ని