Suryakumar: ఐపీఎల్‌ 1000వ మ్యాచ్‌లో.. సూర్య మెరుపు షాట్‌లు ఇవిగో!

వరుస పరాజయాల తర్వాత ముంబయి ఇండియన్స్‌ (MI) ఆదివారం హిట్‌ కొట్టింది. రాజస్థాన్‌ (RR) నిర్దేశించిన 213 పరుగుల లక్ష్యాన్ని.. 4 వికెట్ల నష్టానికి ముంబయి ఛేదించింది. అయితే, భారీ ఛేదనలో ఓపెనర్లు రోహిత్‌ (3), ఇషాన్‌ కిషన్‌ (28) బ్యాట్‌ ఝుళిపించలేకపోయినా.. సూర్య (55; 29 బంతుల్లో 8×4, 2×6) (Suryakumar) తన మెరుపు షాట్‌లతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఫలితంగా ముంబయి రేసులో నిలిచింది. టిమ్‌ డెవిడ్‌ (45 నాటౌట్‌; 14 బంతుల్లో 2×4, 5×6), తిలక్‌ వర్మ (29 నాటౌట్‌) కలిసి మిగిలిన బాధ్యతను పూర్తి చేశారు.

Updated : 01 May 2023 14:58 IST

Tags :

మరిన్ని