బాలకృష్ణ మాటల్లో వివాదం కనిపించడం లేదు: ఎస్వీ రంగారావు మనవళ్లు

తమ తాత, ప్రముఖ నటుడు దివంగత ఎస్వీ రంగారావు గురించి నందమూరి బాలకృష్ణ మాట్లాడిన దాంట్లో వివాదం కనిపించడం లేదని ఆయన మనవళ్లు తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘వీరసింహారెడ్డి’ విజయోత్సవ వేడుకలో ఆ సినిమా హీరో బాలకృష్ణ (Balakrishna).. అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావులను కించపరిచేలా మాట్లాడారంటూ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. వాటిపై స్పందించిన ఎస్వీ రంగారావు మనవళ్లు జూనియర్‌ ఎస్వీ రంగారావు (నటుడు), ఎస్. వి. ఎల్. ఎస్. రంగారావు (బాబాజీ) వీడియో బైట్‌ రిలీజ్‌ చేశారు. 

Published : 26 Jan 2023 07:06 IST

Tags :

మరిన్ని