Chandrababu Arrest: చంద్రబాబును విడుదల చేసే వరకు ఆందోళనలు ఆగవు: నందమూరి సుహాసిని

తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు (Chandrababu Arrest)ను ఖండిస్తూ హైదరాబాద్‌లో తెదేపా శ్రేణులు మౌన పదర్శన నిర్వహించారు. ట్యాంక్ బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి.. నల్ల బెలూన్లను ఎగురవేశారు. గంటపాటు అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. భారీ ఎత్తున కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. మౌన పదర్శనలో నందమూరి సుహాసిని పాల్గొన్నారు. చంద్రబాబును విడుదల చేసేవరకు ర్యాలీలు, ఆందోళనలు కొనసాగిస్తామని సుహాసిని తేల్చి చెప్పారు.

Published : 25 Sep 2023 15:52 IST
Tags :

మరిన్ని