TDP: తెదేపా కార్యకర్తల జోలికొస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి: కాలువ శ్రీనివాసులు

రాయదుర్గం: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు, వైకాపా నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న తెదేపా నాయకులకు సంఘీభావం తెలిపేందుకు మాజీ మంత్రి, తెదేపా పోలిట్‌ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు ఆదివారం ఉదయం చెన్నే కొత్తపల్లి బయలుదేరారు. ఈక్రమంలో కాలువ శ్రీనివాసులును రాయదుర్గం వద్ద పోలీసులు అడ్డుకుని స్థానిక తెదేపా కార్యాలయంలో గృహ నిర్బంధం చేశారు. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ కాలువ శ్రీనివాసులు కనేకల్‌ రోడ్డుపై బైఠాయించి తెదేపా శ్రేణులతో ఆందోళన చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాలువ శ్రీనివాసులును అరెస్టు చేసి రాయదుర్గంలోని ఆయన స్వగృహానికి తరలించారు.

Updated : 27 Nov 2022 16:35 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు