Paritala Sunitha: పరిటాల సునీత ఆమరణ దీక్ష భగ్నం

తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala Sunitha) చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. గత రెండు రోజులుగా అనంతపురం పరిధిలోని పాపంపేటలో ఆమె దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. సునీత ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేసి అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగిలిన ముఖ్య నేతలను అరెస్ట్‌ చేసి మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Updated : 26 Sep 2023 12:17 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు