Chandrababu arrest: ఉండవల్లి అరుణ్ కుమార్‌పై పట్టాభి ఆగ్రహం

చంద్రబాబు (Chandrababu)ను అరెస్టు చేసి జగన్ (Jagan) తన జీవితంలో అతిపెద్ద తప్పు చేశారని.... తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిరామ్ విమర్శించారు. స్కిల్ కేసులో ఉండవల్లి అరుణ్ కుమార్ సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్ వేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఉండవల్లికి నాలుగున్నరేళ్లుగా జరుగుతున్న వైకాపా అవినీతి, దోపిడీ కనిపించట్లేదా అని ప్రశ్నించారు. కుంభకోణాలపై ఎందుకు సీబీఐ దర్యాప్తు కోరలేదని నిలదీశారు. ఎవరో తయారుచేసిన పిటిషన్‌పై ఉండవల్లి సంతకం చేశారని... ప్రేమచంద్రారెడ్డి, అజేయకల్లం పేర్లు ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.

Published : 22 Sep 2023 20:21 IST
Tags :

మరిన్ని