TDP vs YCP: హిందూపురం ప్రెస్‌క్లబ్‌ వద్ద ఉద్రిక్తత

హిందూపురం ప్రెస్‌క్లబ్‌ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైకాపా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వ్యాఖ్యలను ఖండించేందుకు ప్రెస్‌క్లబ్‌లో తెదేపా నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. సమావేశం తర్వాత బయటికి వెళుతుండగా దూసుకొచ్చిన వైకాపా కార్యకర్తలు.. తెదేపా శ్రేణులను అడ్డుకొని నినాదాలు చేశారు. వెంటనే తెలుగుదేశం వర్గీయులు జైబాలయ్య అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.

Published : 28 Sep 2022 16:54 IST
Tags :

మరిన్ని