Uravakonda: ఉరవకొండలో దారుణం.. విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు

అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఉరవకొండ పట్టణం శివారులోని మదర్సాలో ఉన్న విద్యార్థులను.. ఉర్దూ పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు మహబూబ్ బాషా విచక్షణారహితంగా కొట్టడంతో వారికి వాతలు పడ్డాయి. బాధను భరించలేక చిన్నారులు అర్ధరాత్రి సమయంలో మదర్సా ఎదురుగా ఉన్న పెట్రోల్ బంకులో పనిచేసే యువకులకు ఈ విషయాన్ని చెప్పారు. దీంతో వాళ్లు ఉరవకొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

Published : 31 Oct 2022 14:23 IST
Tags :

మరిన్ని