Asian Games 2023: బంగ్లాను చిత్తు చేసిన భారత్‌ .. హైలైట్స్‌ చూసేయండి

ఆసియా గేమ్స్‌ 2023లో భాగంగా మహిళల క్రికెట్‌ సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ సత్తా చాటింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 51 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా పతనంలో పూజా వస్త్రాకర్‌ (4/17) కీలక పాత్ర పోషించింది. లక్ష్యఛేదనలో భారత ఓపెనర్లు కెప్టెన్‌ స్మృతి మంధాన (7), షెఫాలీ వర్మ (17) తడబడినా.. జెమీమా రోడ్రిగ్స్‌ (20*), కనికా (1*) నాటౌట్‌గా నిలిచి మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేశారు. సెమీస్‌లో సత్తా చాటడంతో టీమ్‌ఇండియాకూ పతకం ఖాయమైంది. ఫైనల్‌లోనూ గెలిస్తే టీమ్‌ఇండియాకు స్వర్ణమే.

Updated : 25 Sep 2023 17:29 IST
Tags :

మరిన్ని