TDP-YSRCP: తెదేపా ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి వైకాపా యత్నం.. కొండపిలో ఉద్రిక్తత

ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నాయుడుపాలెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెదేపా (TDP) ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి ఇంటి ముట్టడికి వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వరికూటి అశోక్‌బాబు నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు యత్నించారు. గత ప్రభుత్వ హయాంలో మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని.. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని వైకాపా నేతలు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటి ముట్టడికి వెళ్లేందుకు టంగుటూరులోని వైకాపా కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Updated : 05 Jun 2023 20:40 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు