అడవిలో 45 బ్యాగులు.. అందులో మానవ శరీర భాగాలు..!

ఉత్తర అమెరికా దేశం మెక్సికో (Mexico)లో దారుణం వెలుగుచూసింది. సభ్య సమాజం వణికిపోయేలా ఒళ్లు గగుర్పాటుకు గురయ్యేలా బయటకు వెళ్లాలంటేనే భయంతో చెమటలు పట్టేలా చేసిందా దుర్మార్గం. ఒకటా రెండా 45 సంచుల్లో మానవ శరీర భాగాలు (Human Body Parts) దట్టమైన అటవీ ప్రాంతంలో లభ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇందులో యువతీ యువకుల శరీర అవయవాలు ఉన్నాయి. కర్కశంగా కిరాతకంగా శరీర భాగాలను కోసేసి సంచుల్లో వాటిని భద్రపరిచి బయటకు విసిరేశారు.కనిపించకుండా పోయిన వారి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తుండగా ఈ దారుణం బయటపడింది.

Updated : 02 Jun 2023 18:55 IST

మరిన్ని