Vijay: పట్టాలెక్కిన ‘దళపతి 67’.. విజయ్‌ సరసన త్రిష

తమిళ అగ్ర కథానాయకుడు విజయ్‌ (Vijay), ‘విక్రమ్‌’ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) కలయికలో కొత్త చిత్రం ‘Thalapathy 67 (వర్కింగ్‌ టైటిల్‌)’ లాంఛనంగా పట్టాలెక్కింది. గ్యాంగ్‌స్టర్‌ డ్రామా కథాంశంతో పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ బుధవారం పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ‘మాస్టర్‌’ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు త్రిష, సంజయ్‌దత్‌, అర్జున్‌ తదితర భారీ తారాగణంతో రూపొందనుంది.

Published : 01 Feb 2023 18:49 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు