Elon Musk: ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్‌పై వందలాది కేసులు

ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్‌పై వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ట్విటర్ నుంచి తమను తొలగించిన మస్క్.. నష్ట పరిహారం ఇస్తానన్న హామీని నెరవేర్చలేదని మాజీ ఉద్యోగులు మండిపడుతున్నారు. మస్క్‌పై చర్యలు తీసుకోవాలని శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఆఫీసు గదులను విలాసవంతమైన బెడ్ రూమ్‌లుగా మార్చడం పైనా.. మస్క్‌పై పలువురు మాజీ ఉద్యోగులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.

Published : 09 Dec 2022 16:49 IST
Tags :

మరిన్ని