Shakambari Festival: ఇంద్రకీలాద్రిపై శాకంబరి దేవి ఉత్సవాలు

బెజవాడ కనకదుర్గమ్మ శాకంబరి దేవి అలంకారంలో ఇవాళ్టి నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి గురుపౌర్ణమి వరకు ఇంద్రకీలాద్రిపై శాకంబరి దేవి ఉత్సవాలను నిర్వహించేందుకు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పచ్చని పంటలతో నేలను సస్యశ్యామలం చేసి.. అన్నార్థుల ఆకలి తీర్చేందుకు అమ్మవారు శాకంబరి దేవిగా అవతరించారని పురాణ ప్రతీతి. శాకంబరి దేవిని పూజించడం వల్ల ఆకలి బాధలు దరిచేరవని భక్తుల విశ్వాసం.

Published : 11 Jul 2022 10:56 IST

Tags :

మరిన్ని