IND Vs AUS: భారత్‌-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌.. ఉప్పల్‌ స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రత

ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 2500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. 300 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి.. వాటిని స్టేడియంలోని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేశారు. ప్రతి గేటు వద్ద పకడ్బందీగా తనిఖీలు చేసి క్రికెట్ అభిమానులను లోపలికి పంపించనున్నారు. అభిమానులు ఇతర వస్తువులను లోపలికి తీసుకెళ్లకుండా నిబంధన విధించారు. క్రీడాభిమానుల కోసం మెట్రోరైళ్లు ఒంటిగంటవరకు అందుబాటులో ఉండనుండగా.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది.

Published : 25 Sep 2022 09:34 IST

Tags :

మరిన్ని